మంచు దుప్పటిలో ఇస్తాంబుల్.. శ్వేతవర్ణంలో సిరియా
టర్కీలోని ఇస్తాంబుల్ నగరంలో నాలుగోరోజూ మంచు తీవ్రంగా పడుతోంది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. దీంతో దేశంలోని వివిధ ప్రదేశాల్లో రహదారులను, పాఠశాలలను మూసివేశారు. ఇప్పటికే రోడ్లపై దాదాపు 50 సెం.మీ. మేర మంచు పేరుకుపోయినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు సిరియాలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. బుధవారం భారీ హిమపాతంతో విద్యార్థులకు పరీక్షలు రద్దు చేశారు అధికారులు. ఉత్తర సిరియాలోని పలు గ్రామాలు, పట్టణాలు శ్వేతవర్ణంలో దర్శనమిస్తున్నాయి.