వరుణుడి బీభత్సం... తొమ్మిది మంది మృతి - Heavy rain, floods continue in southern China
కరోనా మహమ్మారి నుంచి బయటపడిన చైనాకు మరో విపత్తు వచ్చిపడింది. గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ వానలకు లోతట్టు ప్రాంతాలు, పంట పొలాలు జలమయమయ్యాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా గ్వాంగ్జీ, హునాన్, గ్వాంగ్డాంగ్, ఇతర దక్షిణ రాష్ట్రాలలోని లక్షలాది మంది జల దిగ్బంధనంలో చిక్కుకున్నారు. జూన్ 2 నుంచి కురుస్తున్న వానల వల్ల ఇప్పటి వరకు 9 మంది మరణించినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.