తెలంగాణ

telangana

ETV Bharat / videos

బ్రెజిల్​ దక్షిణాది రాష్ట్రాలను కుదిపేసిన భారీ వర్షం - Brazil's southern states latest news

By

Published : Jan 4, 2020, 2:43 PM IST

Updated : Jan 5, 2020, 4:43 AM IST

బ్రెజిల్​లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి దక్షిణాది రాష్ట్రాలు అతలాకుతలం అయ్యాయి. పెద్ద ఎత్తున వరదలు, కొండచరియలు విరిగిపడటంతో జనజీవనం స్తంభించిపోయింది. మినాస్ గెరైస్ రాష్ట్ర రాజధాని బెలో హారిజోంటేలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇళ్లలోకి వర్షపు నీరు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. మినాస్ గెరైస్​లో జనవరిలో ఇప్పటివరకు నమోదైన వర్షపాతంలో మూడోవంతు శుక్రవారం ఒక్కరోజే కురిసింది. బ్రెజిల్​లో అత్యధిక జనాభా ఉన్న సావో పాలో పట్టణం వరదల కారణంగా దెబ్బతింది. రోడ్లు ధ్వంసం అయ్యాయి. అస్పత్రులు, రహదారులు బురద, నీటితో నిండిపోయాయి.
Last Updated : Jan 5, 2020, 4:43 AM IST

ABOUT THE AUTHOR

...view details