వరదలతో జలమయమైన మిజూరీ - రోడ్లన్నీ జలమయం
పశ్చిమ మధ్య అమెరికా రాాష్ట్రం మిజూరీని వరదలు ముంచెత్తాయి. తుపాను ధాటికి రోడ్లన్నీ జలమయమై వాగులను తలపిస్తున్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. తుపాను సమయంలో మెరుపుల కారణంగా ఓ ప్రాంతంలో పేలుడు జరిగింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి నగరమంతా అంధకారమైంది.