టర్కీ సరిహద్దు వద్ద ఆందోళన.. జలఫిరంగుల ప్రయోగం - telugu latest news
టర్కీ నుంచి గ్రీస్ దేశానికి సరిహద్దు వెంబడి వెళ్లేందుకు ప్రయత్నించిన వలసదారులను గ్రీక్ దళాలు అడ్డుకొని వారిపై బాష్పవాయువు, జల ఫిరంగులు ప్రయోగించాయి. ఇప్పటివరకు ఇద్దరు వలసదారులు గాయపడ్డారు. ఘటనకు సంబంధించిన వీడియోలను టర్కీ ప్రభుత్వం విడుదల చేసింది. గత వారంలోనూ ఓ వలసదారుని గ్రీక్ పోలీసులు కాల్చి చంపినట్లు టర్కీ అధికారులు తెలిపారు.