ఆ వీధిలోని కుటుంబాలన్నీ ఒకేసారి చప్పట్లు కొడితే... - కరోనా వైరస్ వార్తలు
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. వైరస్ బారిన పడి ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజకు పెరుగుతోంది. కంటిమీద కునుకు లేకుండా.. రోగులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఐరోపాలో కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో ఇటలీ, ఫ్రాన్స్ దేశాలు తీవ్ర ఆంక్షలు ఎదుర్కొంటున్నాయి. ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్‌లోని పర్షియన్లు.. కరోనాపై పోరులో వైద్యులు, నర్సులు, ఆరోగ్యశాఖ సిబ్బంది పాత్రను ప్రశంసిస్తూ చప్పట్లతో తమ కృతజ్ఞతలు తెలిపారు.