'మరియాచీ వేడుక': మెక్సికన్ వీధుల్లో సందడి
వీధివీధంతా రంగురంగుల వేషధారణతో.. ప్రపంచ నలుమూలలకు చెందిన భిన్న రంగాల కళాకారులందరి ప్రదర్శనలు ఇక్కడ మనం ఆస్వాదించవచ్చు. జానపద సంగీత కళాకారులు, నృత్యకారులు... అంతా కలిసి భిన్న అలంకరణలతో వారి కళాపోషణతో వీక్షకుల్ని అలరిస్తుంటారు. ఔత్సాహికులంతా ఎంతో ఉత్సాహంగా ఈ ప్రదర్శనల్ని తిలకిస్తారు. ఈ పండుగ పేరు 'మరియాచీ'. ఈ వేడుకను మెక్సికోలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఆస్ట్రేలియా, స్వీడన్, పెరూ సహా 25 దేశాల నుంచి కళాబృందాలు పాల్గొన్నాయి. మెక్సికో సంప్రదాయ సంగీతంలో మరియాచీకి ప్రపంచవ్యాప్త ఆదరణ ఉంది. సంతోషానికి, సరదాకి ఆ సంగీతం ఓ మెక్సికన్ బ్రాండ్.
Last Updated : Sep 28, 2019, 12:44 PM IST