రష్యాలో తగ్గని వరదలు- ఐదుగురు మృతి - రష్యాలో భారీ వర్షాలు
రష్యాలో వరద ప్రభావం రోజురోజరుకు తీవ్రమవుతోంది. ఆగ్నేయ రష్యాలోని ఇర్కుస్క్ ప్రాంతంలో వరదల్లో చిక్కుకుని ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 350 మందికి గాయాలయ్యాయి. వరద ప్రాంతంలో ఇళ్లు పూర్తిగా నీట మునగడం వల్ల వేలాది మంది నిరాశ్రయులయ్యారు. జీ20 సదస్సు ముగించుకుని తిరిగి వచ్చిన రష్యా అధ్యక్షుడు పుతిన్... ముప్పు ప్రాంతాల్లో పర్యటించారు. వరద బాధితులను హెలికాప్టర్లు, పడవల ద్వారా రక్షిస్తున్నట్లు అధికారులు వెల్లడించింది. ఇర్కుస్క్ ప్రాంతంలో భారీ వర్షాలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేనందున అత్యవసర పరిస్థితిని కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది.