మంచు కురిసింది.. అమెరికా పులకరించింది - Snow fall videos in America
అమెరికాలోని పలు నగరాల్లో భారీగా మంచు కురుస్తోంది. దీంతో రాహదారులు, ఇళ్లు, చెట్లు శ్వేతవర్ణంలో దర్శనమిస్తున్నాయి. మంచు ఎక్కడికక్కడ పేరుకుపోవడం వల్ల ప్రజలు రోడ్లపైనే స్కేటింగ్ చేస్తూ.. మంచును ఆస్వాదిస్తున్నారు. హిమపాతం కారణంగా కార్లు పూర్తిగా మంచుతో నిండిపోయాయి. న్యూయార్క్‌లో మంచు ప్రభావం అధికంగా ఉంది. హిమపాతం కారణంగా రోడ్లపై మోకాళ్ల లోతు వరకూ మంచు పేరుకుపోయింది. దీంతో మంచులో ఆడుకుంటూ సరదాగా గడుపుతున్నారు అక్కడి ప్రజలు.
Last Updated : Dec 18, 2020, 9:41 AM IST