రష్యాలో కనువిందు చేసిన బాణాసంచా కాంతులు - రష్యా తాజా వార్తలు
రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ నగరంలో బాణాసంచా ప్రదర్శన కనువిందుచేసింది. విద్యా సంవత్సరం పూర్తైన సందర్భంగా ఏటా స్కార్లెట్ సెయిల్స్ ఈవెంట్ జరపడం రష్యాలో ఆనవాయితీ. ఇందులో భాగంగా నెవా నది తీరంలో అద్భుతమైన బాణాసంచాల కాంతులు వీక్షకులను ఆకట్టుకున్నాయి. కరోనా నేపథ్యంలో యువతీ యువకుల సందడి లేకుండానే ఈ ఏడాది వేడుకను నిర్వహించారు.