తెలంగాణ

telangana

ETV Bharat / videos

గిడ్డంగిలో అగ్ని ప్రమాదం- ఉవ్వెత్తున ఎగసిన మంటలు - అమెరికాలో అగ్ని ప్రమాదం

🎬 Watch Now: Feature Video

By

Published : Jun 6, 2020, 5:34 AM IST

అమెరికా కాలిఫోర్నియా రాష్ట్రంలోని ఓ గిడ్డంగిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అమెరికా కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. గిడ్డంగిలో పనిచేస్తున్న దాదాపు 100 మంది ఉద్యోగులు వెంటనే బయటకు వచ్చేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్పష్టం చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక బృందాలు మంటలను ఆర్పివేసినట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details