చమురుబావిలో మంటలు.. 13రోజులుగా విషవాయువు లీక్
తూర్పు అసోం టిన్సుకియా జిల్లాలోని భాగ్జన్ వద్ద ఓ చమురు బావిలో మంటలు చెలరేగాయి. గత 13 రోజులుగా ఈ చమురు కేంద్రం నుంచి విష వాయువు లీక్ అవుతోంది. దీని ప్రభావం పక్కనే ఉన్న డిబ్రూ సాయిఖొవా జాతీయ పార్కు, మాగురి మోటా పంగ్ వెట్లాండ్లోని జీవాలపై తీవ్రంగా పడింది. లీకేజీని అరికట్టేందుకు అసోం ప్రభుత్వం సింగపూర్ నుంచి నిపుణులను పిలిపించింది. అయితే అంతలోనే ఈ మంటలు చెలరేగాయి.