ఆహా! పాదముద్రలతో మంచుపై అందమైన కళాకృతులు - ఫిన్నిష్ డ్రాయింగ్
ఫిన్లాండ్ రాజధాని హెల్సెంకి సమీపంలో అద్భుతమైన స్నో(మంచు) డ్రాయింగ్ అక్కడి ప్రజలను ఆకట్టుకుంది. ఫిన్నిష్ కళాకారుడు జాన్నే పీకో.. తన కాలి అడుగులతో ఈ అద్భుత కళాఖండాలను రూపొందించారు. మంచులో పాదముద్రలతో గీసిన ఈ అందమైన కళాఖండాలు.. చూపరులకు ఎంతో ఆకర్షణీయంగా నిలిచింది. సుమారు 160 మీటర్ల వ్యాసంలో ప్రదర్శితమైన ఈ డ్రాయింగ్.. నార్డిక్(స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్) దేశాలలోనే అతిపెద్ద మంచు కళాఖండంగా పేరుగాంచింది. దీన్ని రూపొందించేందుకు వలంటీర్ల బృందంతో కలిసి రెండు రోజుల పాటు శ్రమించారు పీకో.