వీళ్ల 'లాక్డౌన్ సాహసాలు' చూస్తే ఔరా అనాల్సిందే... - coronavirus symptoms
కరోనా కారణంగా భారత్ సహా వివిధ దేశాల్లో లాక్డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న ప్రజలు అంతర్జాలంలో సినిమాలు, షోలు వీక్షించడం, టీవీ ముందు సమయం గడపడం వంటివి చేస్తున్నారు. ఇందుకు భిన్నంగా పలువురు సాహస క్రీడాకారులు ఇంటినే మైదానంగా మార్చేస్తున్నారు. కెనడాకు చెందిన స్నోబోర్డ్ క్రీడాకారుడు సెబాస్టియన్ టౌటాంట్ 'ద ఫ్లోర్ ఈజ్ లావా' పేరుతో ఆడిన ఆట చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఇంట్లోని ఒక పాయింట్ నుంచి మరో పాయింట్‌కు ఫ్లోర్‌ను తాకకుండా వివిధ ఉపకరణాల సాయంతో వెళ్లాడు సెబాస్టియన్.