గాల్లో పల్టీలు కొట్టిన కారు.. రేసర్‌కు తీవ్ర గాయాలు - car race accident
మియామీలో జరిగిన 2020 డేటోనా 500 రేసులో ప్రమాదం జరిగింది. రేసు జరుగుతున్న సమయంలో రౌస్ ఫెన్‌వే రేసర్ ర్యాన్‌న్యూమెన్ నడుపుతున్న కారు ప్రమాదానికి గురైంది. రేసు ఆఖరి ల్యాప్‌లో ముందంజలో ఉన్న సమయంలో న్యూమెన్ తన కారుపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో వెనుక వస్తున్న మరో కారు.... న్యూమెన్ కారును ఢీ కొనడం వల్ల కారు అమాంతం గాల్లో పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రేసర్ ర్యాన్ తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Last Updated : Mar 1, 2020, 6:42 PM IST