అగ్నిపర్వతం బద్దలు.. బూడిదతో ఇక్కట్లు - ఎట్నా అగ్నిపర్వతం వైరల్ వీడియోలు
ఇటలీలోని అతిపెద్ద క్రియాశీల అగ్నిపర్వతం ఎట్నా.. శనివారం విస్ఫోటనం చెందింది. బూడిద, నారింజ లావాను గాలిలోకి విడుదల చేసింది. నైరుతి బిలం వద్ద సుమారు 1800 మీటర్ల ఎత్తులో పేలుడు జరగగా... కొన్ని గంటలపాటు లావా ఎగసిపడినట్లు స్థానికులు చెప్పారు.