తెలంగాణ

telangana

ETV Bharat / videos

86వ అంతస్తుకు మెట్లపై పరుగు- పదోసారీ గెలుపు - stair race

By

Published : May 15, 2019, 2:17 PM IST

1,454 అడుగుల ఎత్తయిన భవంతిలో జరిగిన మెట్ల పరుగు పందెంలో విజేతగా నిలిచింది సింగపూర్​కు చెందిన సుజీ వాల్షామ్​. ప్రసిద్ధి గాంచిన న్యూయార్క్ 'ఎంపైర్​ స్టేట్​ బిల్డింగ్​ రన్నప్'​ పోటీల్లో ఆమె ఈ ఘనత సాధించింది. 12నిమిషాల 18 సెకన్లలో భవంతి 86వ అంతస్తుకు మెట్లపై నుంచి పరుగెత్తి చేరుకుంది సూజీ. ఈ పోటీల్లో 10 సార్లు విజేతగా నిలిచి రికార్డు నెలకొల్పింది. పురుషుల విభాగంలో పోలాండ్​కు చెందిన పియోటర్ లోబోజిన్​స్కీ 10 నిమిషాల 5 సెకన్లలో పందెం పూర్తి చేసి విజేతగా నిలిచాడు.

ABOUT THE AUTHOR

...view details