మంచులో ఉల్లాసంగా గడిపిన ఏనుగులు - అరిజోనా వార్తలు
అరిజోనాలోని రీడ్ జంతు ప్రదర్శనశాలలో మంచులో గజరాజులు ఉల్లాసంగా గడిపిన దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. టక్సన్ నగరంలో గత కొద్దిరోజులుగా భారీగా మంచు కురుస్తోంది. దీంతో పరిసరాలన్నీ మంచుదుప్పటి కప్పుకోగా హిమపాతంలో ఆడుకుంటూ ఉత్సాహంగా గడిపాయి అక్కడి ఏనుగులు. ముఖ్యంగా పెన్జీ అనే ఏనుగు పిల్ల.. పక్కనే ఉన్న నంది అనే మరో ఏనుగుతో ఆడుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.