తెలంగాణ

telangana

ETV Bharat / videos

viral: అడవిలో హాయిగా సేద తీరుతున్న ఏనుగులు - చైనా ఏనుగుల వైరల్​ వీడియో

By

Published : Jun 14, 2021, 10:11 AM IST

చైనాలో ఓ ఏనుగుల గుంపు చేష్టలు నెట్టింట వైరల్​గా మారాయి. యూన్నాన్​ రాష్ట్రంలోని షువాంగ్బన్న నేషనల్ నేచర్ రిజర్వ్ నుంచి తప్పించుకున్న ఏనుగుల గుంపు దక్షిణ దిశగా ప్రయాణిస్తోంది. పంట పొలాల్లో దొరికే గోధుమ, అరటి వంటి ఆహారాన్ని తింటున్నాయి. తాజాగా నాన్​శాన్​ గ్రామంలోకి ప్రవేశిస్తున్న ఏనుగుల గుంపును డ్రోన్​ కెమరాలు గుర్తించాయి. రోజూ దాదాపు 20 కి.మీ ప్రయాణం చేస్తూ మధ్యలో అలసి నిద్రిస్తున్నాయి. ఈ దృశ్యాలు చూపరులను ఆకర్షిస్తున్నాయి. పిల్ల ఏనుగులు నిద్రిస్తున్న తల్లి ఏనుగుల మధ్య ఆటలాడుతున్న దృశ్యాలు కట్టిపడేస్తున్నాయి. అధికారులు ఆ ఏనుగుల గుంపును మళ్లీ రిజర్వ్​ ఫారెస్ట్​లోకి మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details