పర్యటకులపై ఏనుగు దాడి.. సఫారీ వాహనం ధ్వంసం - దక్షిణాఫ్రికాలో పర్యటకులపై ఏనుగు దాడి
Elephant attacks tourists: దక్షిణాఫ్రికాలో పర్యటకులపై ఏనుగు దాడి చేసింది. లింపొపొ రాష్ట్రంలోని సెలాటి గేమ్ రిజర్వ్‌లో ఈ ఘటన జరిగింది. ఏనుగులను దూరం నుంచి చూసేందుకు పర్యటకుల వాహనం ఆగిన సమయంలో మరోవైపు ఓ గజరాజు కోపంతో దూసుకొచ్చింది. సఫారీ వాహనాన్ని కొమ్ములతో నెట్టివేసింది. దీంతో పర్యటకులు భయంతో దూరంగా పారిపోయారు. వాహనం స్వల్పంగా ధ్వంసమైంది. శరీరంలో టెస్టోస్టిరాన్ స్థాయి అధికం కావడం వల్లే.. ఏనుగు కోపంతో ప్రవర్తించిందని ఎకో ట్రైనింగ్ విభాగం వెల్లడించింది.