పారిస్‌లో ఘనంగా 'బాస్టిల్ డే' వేడుకలు - ఈఫిల్ టవర్
సాంప్రదాయ బాస్టిల్ డేను పురస్కరించుకుని పారిస్‌లోని చాంప్స్ డి మార్స్ వద్దకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. ఈఫిల్ టవర్ ముందు రంగురంగుల బాణసంచా వెలుగులను చూసి ప్రజలు ముగ్దులయ్యారు. కొవిడ్ ఆంక్షల కారణంగా పారిస్‌లో కఠినమైన నియంత్రణలు ఉన్నప్పటికీ బాణాసంచా వెలుగులను వీక్షించేందుకు జనం భారీ సంఖ్యలో తరలివచ్చారు.