జేబులో ఫోన్‌తో జూడో ఫైట్- తర్వాత ఏమైంది? - Azerbaijan
అంతర్జాతీయ పోటీ అంటే ఎంతో జాగ్రత్తగా బరిలో దిగాల్సి ఉంటుంది. కానీ ఓ క్రీడాకారుడి నిర్లక్ష్యంతో ఆట నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. అజెర్బైజాన్ దేశంలో జరిగిన 'బాకు గ్రాండ్‌స్లామ్ ప్రపంచ జూడో టూర్-2019' లో ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగించే ఘటన జరిగింది. 81 కిలోల విభాగంలో జూడో పోటీ జరుగుతున్న సమయంలో పోర్చుగల్‌కు చెందిన క్రీడాకారుడు అన్రి ఎగుటిడ్జ్ జేబులోంచి ఫోన్ కింద పడింది. గమనించిన నిర్వాహకులు వెంటనే పోటీని నిలిపేశారు. అతనిపై అనర్హత వేటు వేశారు. ఇప్పుడీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
Last Updated : May 12, 2019, 1:01 PM IST