సుడిగుండంలో ఓడ- సిబ్బందిని కాపాడిన విపత్తు దళం - తుపానులో చిక్కుకున్న ఓడ
ఉత్తర సముద్ర సుడిగుండంలో చిక్కుకున్న డచ్ సరుకు రవాణా ఓడను నార్వే విపత్తు సిబ్బంది కాపాడారు. ముడి చమురుతో నెదర్లాండ్స్‌కు వెళ్తున్న హెన్‌డ్రికా నౌక మంగళవారం ఉత్తర సముద్రంలో సంభవించిన సుడిగుండంలో చిక్కుకుంది. భీకరమైన గాలులకు ఓడ అతలాకుతలం అయ్యింది. సముద్రంలో మునిగేలా కనిపించింది. ప్రమాద సమాచారాన్ని నౌకలోని సిబ్బంది నార్వే ప్రభుత్వానికి చేరవేశారు. వెంటనే స్పందించిన నార్వే తీర రక్షణ దళం హెలికాప్టర్‌తో సాయంతో ఓడలోకి దిగి సిబ్బందిని రక్షించింది.
Last Updated : Apr 8, 2021, 6:30 AM IST