అదిరేటి డ్రస్సులతో శునకాల సర్ఫింగ్ పోటీలు - అమెరికా
అమెరికాలో వేసవి కాలం ముగుస్తోంది. శునకాలు సముద్ర తీరంలో సర్ఫింగ్ చేసి సేదతీరాయి. కాలిఫోర్నియాలోని 'రాచో సాంటా ఫే' బీచ్లో జరిగిన శునకాల సర్ఫింగ్ పోటీలు జంతు ప్రేమికులను అలరించాయి. హెలెన్ వుడ్‌వర్డ్ యానిమల్ సెంటర్ తన 14వ వార్షిక సర్ఫ్ 'డాగ్ సర్ఫ్-ఎ-థాన్' పోటీలు నిర్వహించింది. దాదాపు 70 శునకాలు ఈ పోటీలో పాల్గొన్నాయి. వాటి ప్రత్యేక వేషధారణకూ మార్కులు ఉంటాయి. దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని అనాధ జంతువులకు సాయం చేసేందుకు ఉపయోగిస్తారు.
Last Updated : Sep 30, 2019, 7:30 AM IST