తెలంగాణ

telangana

By

Published : Mar 29, 2020, 9:32 PM IST

ETV Bharat / videos

ఈ వీడియో చూస్తే కరోనా భయాలన్నీ పరార్!

భయం... ఏదో జరుగుతుందన్న ఆందోళన... కరోనా కాలంలో దాదాపు అందరిదీ ఇదే పరిస్థితి. కానీ... మనిషి సంకల్పంకన్నా ఏదీ శక్తిమంతమైనది కాదు. అప్రమత్తంగా ఉంటూనే సాహస స్వభావాన్ని అలవర్చుకుంటే ఎలాంటి సవాళ్లనైనా అధిగమించవచ్చు. ఈ మాటలకు సరిగ్గా సరిపోయే వీడియో ఇది. గతేడాది మేలో రష్యా కాకసస్​లో జరిగిన అంతర్జాతీయ హైలైన్​ ఉత్సవానికి సంబంధించినది. భూమికి 1000 మీటర్ల ఎత్తులో ఎలాంటి ఆధారం లేకుండా సన్నటి తాడుపై చేసే సాహసం... మనిషి గుండె ధైర్యానికి నిదర్శనం.

ABOUT THE AUTHOR

...view details