కోర్టులోనే న్యాయవాదిపై దాడి చేసిన నిందితుడు
న్యాయమూర్తి సమక్షంలోనే న్యాయవాదిపై ఓ నిందితుడు దాడి చేశాడు. ఈ ఘటన అమెరికా ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్డేల్ కోర్టులో జరిగింది. నిందితుడిని వెంటనే భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఈ దృశ్యం కోర్టు గది కెమెరాలో రికార్డయింది. న్యాయవాది జూలీ చేస్ను అధికారులు ఆసుపత్రికి తరలించారు. నిందితుడి అనూహ్య ప్రవర్తనపై స్పష్టత లేదు.