న్యూయార్క్లో రికార్డు స్థాయిలో హిమపాతం - మంచు తుపాను
అమెరికా న్యూయార్క్ నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో మంచు కురిసింది. మొకాళ్ల లోతులో మంచు పేరుకుపోయింది. గ్లేన్విల్లా ఆల్బే ప్రాంతంలో గురువారం అత్యధిక స్థాయిలో గంటకు 10 సెంటీ మీటర్లు చొప్పున 76 సెంటీమీటర్ల మేర మంచు కురిసిందని అధికారులు తెలిపారు. సహాయక సిబ్బంది మంచు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు.