తెలంగాణ

telangana

ETV Bharat / videos

చైనా ఆర్డర్.. ఆ జిల్లాలోని జనం అందరికీ కరోనా టెస్టులు! - చైనా బీజింగ్​లో కొవిడ్ వ్యాప్తి

By

Published : Jan 24, 2022, 2:31 PM IST

Covid Testing Beijing: చైనా రాజధాని బీజింగ్​లో మరోసారి కరోనా విజృంభిస్తోంది. తాజాగా నగరంలో ఆరు కేసులు నమోదయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నగరం దాటి ఎవరూ బయటకు వెళ్లొద్దని ఆదేశించారు. బీజింగ్ సరిహద్దు జిల్లా ఫెంగ్​టాయ్​లోనూ తాజాగా 25 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలోని 20 లక్షల మందికి వైరస్ నిర్ధరణ పరీక్షలు ప్రారంభించారు. ఈ క్రమంలో కొవిడ్ పరీక్షల కోసం ప్రజలు బారులు తీరారు. ఫిబ్రవరి 4న వింటర్ ఒలింపిక్స్ ప్రారంభంకానున్న నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

ABOUT THE AUTHOR

...view details