సంగీతం ఒకటే.. పాడే గొంతులే వేలల్లో... - MUSIC FESTIVAL
35 వేల మంది గాయకులతో ఏకధాటిగా సాగింది గాన ప్రదర్శన. ఆ మధుర గానం వినేందుకు రెండు చెవులూ సరిపోవు. అంతమంది ఒకేసారి పాడుతుంటే కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిందే. నాలుగు రోజులపాటు సాగిన జానపద సంగీత వేడుకల్లో భాగంగా ఐరోపాలోని ఎస్టోనియాలో కనిపించిందీ అరుదైన సన్నివేశం. వేడుకల్లో దాదాపు 90 వేల మందికిపైగా పాల్గొని సందడి చేశారు.