చిలీ: ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు హింసాత్మకం - అంతర్జాతీయ వార్తలు
గత 10 రోజుల నుంచి చిలీలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. శాంటియాగో వద్ద మంగళవారం రోడ్లమీదకు వచ్చి ఆందోళనకారులు ప్రదర్శనలు చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఇరువురి మధ్య ఘర్షణ వాతావారణం నెలకొంది. పోలీసులపైకి నిరసనకారులు రాళ్లు రువ్వారు. వారిని అరికట్టేందుకు ఆందోళనకారులపైకి జల ఫిరంగులను, బాష్పవాయువును ప్రయోగించారు పోలీసులు.
Last Updated : Oct 30, 2019, 11:20 AM IST