చైనాలో ఘనంగా 'గ్రానీ పాండా' జన్మదిన వేడుకలు - granny panda 38th birthday
ప్రపంచంలోనే అతిపెద్ద పాండాగా గుర్తింపు పొందిన 38ఏళ్ల 'గ్రానీ పాండా'కు ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు చైనీయులు. దేశంలోని చాంగ్కింగ్ జూలో జరిగిన ఈ కార్యక్రమంలో 'గ్రానీ పాండా' కోసం ప్రత్యేక ఆహారంతో కూడిన కేకును తయారుచేశారు. సుమారు 100మందికిపైగా హాజరైన ఈ వేడుకలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంది ఆ పాండా.