పర్వత శిఖరాన సంగీత ప్రదర్శన.. వీక్షకులకు కనువిందు - మౌంట్ హువాషాన్ పర్వతాల్లో సంగీత ప్రదర్శన
చైనా షాంగ్జీలోని మౌంట్ హువాషాన్ పర్వతాల్లో 120 మంది సంగీత కళాకారులు చేసిన ప్రదర్శన ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది. సముద్ర మట్టానికి 2,086 మీటర్ల ఎత్తులో ప్రకృతి సోయగాల మధ్య కళాకారులు చేసిన ప్రదర్శన చూపరుల మనసును హత్తుకుంది. జియాన్ సింఫనీ ఆర్కెస్ట్రా నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్ సహా వివిధ లైవ్ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫాంలపై వేలాది మంది వీక్షించారు. ఆహ్లాదకరమైన సంగీతంతో పాటు హూవాషాన్ పర్వతం అద్భుత దృశ్యాలు వీక్షకులను అలరించాయి.