నూతన సంవత్సర వేడుకలకు ముస్తాబవుతున్న చైనా - 2021 స్ప్రింగ్ ఫెస్టివల్ గాలా
చైనాలో నూతన సంవత్సర వేడుకలకు ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారు. 2021 స్ప్రింగ్ ఫెస్టివల్ గాలా కోసం గ్వాంగ్డాంగ్లోని ఓ అంతర్జాతీయ పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థులు.. పేపర్ కటౌట్లు, కాలిగ్రఫీ, డ్రాగన్ డాన్స్ సహా.. చైనీస్ సంప్రదాయబద్ధంగా ఉత్సవ ఏర్పాట్లు చేస్తున్నారు. కొత్త ఏడాదికి ప్రతీకగా నిలిచేలా ఈ మేరకు అక్కడ జరిగే సంబరాలకు సంబంధించి ఓ వీడియోను రూపొందించింది చైనా. గాలా నృత్యాలు, కామెడీ స్కెచ్లు, మ్యాజిక్, అక్రోబాటిక్స్తో పాటు మరెన్నో ఆకర్షించే వినోద కార్యక్రమాలు ఇందులో కనిపించాయి.