కార్చిచ్చు బీభత్సం - వేల ఎకరాల్లో అడవులు దగ్ధం - కాలిఫోర్నియాలో కార్చిచ్చు
అమెరికాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. కాలిఫోర్నియా, నెవడా రాష్ట్ర సరిహద్దుల్లో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. నెవడాలో 275 చ.కి.మీల మేర అడవులు కాలిపోయాయి. కాలిఫోర్నియాలో 282 చ.కి.మీలో మంటలు వ్యాపించాయి. ఇరు రాష్ట్రాల అధికార యంత్రాంగం మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తోంది. అమెరికాలో దాదాపు 11రాష్ట్రాల్లోని భూభాగాల్లో మంటలు వ్యాపించాయి. ఇప్పటివరకు 6000 చ.కి.మీల మేర అడవులు అగ్నికి ఆహుతి అయ్యాయని నేషనల్ ఫైర్ సెంటర్ తెలిపింది.