తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రేయసికి అలా ప్రపోజ్​ చేసి.. మనసు గెలిచి - క్యాడెట్​ ప్రపోజ్​

By

Published : Jul 15, 2021, 11:40 AM IST

సాధారణంగా.. స్టేడియాలు, సినిమా హాళ్లు, మాళ్లు, రెస్టారెంట్లలో.. ప్రేయసికి ప్రియుడు 'ప్రపోజ్​' చేయడం తరచూ చూస్తునే ఉంటాము. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఎన్నో ఉంటాయి. కానీ ఫ్రాన్స్​కు చెందిన మ్యాక్సిమిలియన్ అనే జవాను​.. తన ప్రేయసికి వినూత్న రీతిలో ప్రపోజ్​ చేశాడు. ఇందుకు ఫ్రాన్స్​ జాతీయ దినోత్సవమైన 'బాస్టిల్లె డే' వేదికైంది. పారిస్​లోని ఛాంప్స్​ అలీసీ ప్రాంతంలో సైనిక కవాతుకు క్యాడెట్లు సన్నద్ధమవుతుండగా.. ఆ బృందంలో ఒకడైన మ్యాక్సిమిలియన్​.. ప్రేయసి వద్దకు వెళ్లాడు. మోకాలిపై కూర్చుని, అందరూ చూస్తుండగా ఆమెకు ప్రపోజ్​ చేశాడు. ఇందుకు ఆమె ఒప్పుకోగా.. మ్యాక్సిమిలియన్​ ఆనందంతో ప్రేయసి చేతికి రింగు తొడిగాడు. ఈ దృశ్యాలు చూసిన ఇతర క్యాడెట్లు, స్థానికులు.. చప్పట్లు కొడుతూ శుభాకాంక్షలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details