బ్రెజిల్లో వరదలకు ముగ్గురు బలి - Brazil
ఈశాన్య బ్రెజిల్లో కుండపోత వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. గురువారం రాత్రి తెరెసీనా నగరంలో 77 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రాత్రికి రాత్రే ఊహించని విపత్తు చుట్టుముట్టినందున ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 3,600 మంది నిరాశ్రయులయ్యారు. శుక్రవారమూ వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.