రణరంగంలా పార్లమెంట్- పంది మాంసంతో దాడులు - Fighting erupted in the Taiwanese parliament
అమెరికా నుంచి పంది, గొడ్డు మాంసం దిగుమతిపై తైవాన్ పార్లమెంట్లో జరిగిన చర్చ ఘర్షణకు దారితీసింది. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఒకరిపై ఒకరు మాంసం విసురుకుంటూ.. చట్టసభను రణరంగంలా మార్చివేశారు. నేలపై పడేసి పిడిగుద్దులు కురిపించుకున్నారు. అమెరికాతో జరిగిన వాణిజ్య ఒప్పందం తర్వాత ఆ దేశం పంది మాంసం దిగుమతిపై నిషేధం ఎత్తివేసిన నేపథ్యంలో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.