హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న కొలంబియా - కొలంబియా రాజధాని బొగోటా హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది.
కొలంబియా రాజధాని బొగోటా హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. అధ్యక్షుడు ఇవాన్ డుక్యూ పాలనకు వ్యతిరేకంగా శనివారం దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు నినాదాలు చేస్తూ నిరసన బాట పట్టారు. రాజధాని వీధుల్లో కవాతు చేశారు. ఆందోళనకారులు చారిత్రక ప్లాజా బొలివర్ వద్ద గుమిగూడిన అనంతరం.. పోలీసులపై రాళ్లు రువ్వారు. ఘర్షణలను నివారించే ప్రయత్నంలో పోలీసులు నిరసనకారులపై బాష్పవాయు గోళాలు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు.