కరెంటు స్తంభంలో ఇరుక్కున్న ఎలుగుబంటి.. చివరికి! - కరెంటు పోల్ ఎక్కిన ఎలుగుబంటి
అమెరికాలోని అరిజోనాలో విద్యుత్ అధికారులను కాసేపు కంగారు పెట్టింది ఓ ఎలుగుబంటి. దక్షిణ అరిజోనా నగరంలోని ఓ స్తంభంలో ఈ భల్లూకం ఇరుక్కుంది. సమాచారం అందుకున్న విల్కాక్స్ సంస్థ.. విద్యుత్తును నిలిపివేసింది. అనంతరం ఒక లైన్మన్ బకెట్ లిఫ్టులో పైకి వెళ్లి, కర్రతో కొట్టడానికి ప్రయత్నించాడు. కర్రను కొన్నిసార్లు కొరికి పట్టుకున్న ఎలుగు.. కాసేపటికి స్వయంగా దిగి పక్కనే ఉన్న ఎడారిలోకి పరిగెత్తింది.