టీకాలపై వ్యతిరేకత.. మాకొద్దంటూ వేలమంది నిరసనలు - బ్రిటన్ న్యూస్ టుడే
Anti Covid Vaccine Protests: బ్రిటన్లో కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రబలుతున్న నేపథ్యంలో టీకా పంపిణీని ముమ్మరం చేసింది అక్కడి ప్రభుత్వం. అయితే బలవంతంగా టీకాలు ఇస్తున్నారంటూ.. నిరసన ప్రదర్శనలు చేపట్టారు అక్కడి పౌరులు. 'యునైటెడ్ ఫర్ ఫ్రీడం' మార్చ్ పేరిట సెంట్రల్ లండన్‌లో నిర్వహించిన ఆందోళనల్లో దాదాపు 5వేలమంది పాల్గొన్నారు. పార్లమెంటు స్క్వేర్తో పాటు.. ప్రధాని అధికారిక నివాసం డౌనింగ్ స్ట్రీట్ వద్ద కూడా నిరసనలు జరిగాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు పోలీసులు. ఫలితంగా నిరసనకారులు- పోలీసుల మధ్య ఘర్షణ తలెత్తింది.