3 వారాలుగా గడ్డకట్టే మంచులో ఒక్కడే..! - latest alaska news
అమెరికా అలస్కాలోని స్క్వెంటా ప్రాంతంలో కొద్ది కాలంగా విపరీతమైన మంచు కురుస్తోంది. అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా అక్కడి నివాసితుల్లో 34 మంది వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. టైసన్ స్టీల్ అనే వ్యక్తి మాత్రం బయటపడలేకపోయాడు. మూడు వారాలుగా గడ్డకట్టే మంచులో సాయం కోసం ఎదురు చూసిన స్టీల్.. ఎట్టకేలకు ప్రాణాలు దక్కించుకున్నాడు. ఎస్ఓఎస్ అనే ఎమర్జెన్సీ సింబల్‌ను మంచులో పెద్ద అక్షరాలతో రాయగా... పరిశీలనకు వచ్చిన భద్రతా సిబ్బంది అతన్ని రక్షించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.