రెండు నిమిషాల్లోనే నగరం చెరువుగా మారింది..!
అమెరికాలోని డావెన్పోర్ట్లో అకస్మాత్తుగా వరదలు వచ్చాయి. మిస్సిస్సిపీ నదిపై కట్టిన తాత్కాలిక వంతెన కూలటం వల్ల పట్టణంలోకి భారీ స్థాయిలో వరద నీరు చేరింది. పట్టణంలోకి వస్తున్న నీటి ప్రవాహ దృశ్యాలు నది ఒడ్డున ఉన్న ఓ రెస్టారెంట్ సీసీ కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. అధికారులు అప్రమత్తం చేయటం వల్ల ముందుగానే స్థానికులు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు.