అమెరికా సైనికుల నోట 'జనగణమన' - indian national anthem
'యుధ్ అభ్యాస్ 2019’ సైనిక శిక్షణ సందర్భంగా అమెరికా సైనికులు తమకు చెందిన బ్యాండ్ బృందం సాయంతో భారత జాతీయ గీతాన్ని లయబద్ధంగా వాయించారు. ఇండో- యూఎస్ రక్షణ సహకారంలో భాగంగా సెప్టెంబర్ 5వ తేదీన ప్రారంభమైన సైనిక శిక్షణ కార్యక్రమాలు నిన్నటితో ముగిశాయి. యుధ్ అభ్యాస్లో భాగంగా ఇరు దేశాల రక్షణ దళాలు అనేక యుద్ధ వ్యూహాల్లో తర్ఫీదు పొందాయి. మాక్ డ్రిల్ కూడా నిర్వహించారు. శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా అమెరికా రక్షణ దళం భారత జాతీయ గీతాన్ని లయబద్ధంగా వాయించి ఆకట్టుకుంది.
Last Updated : Oct 1, 2019, 4:56 AM IST