'లావా' బీభత్సం.. 2 వేల ఎకరాల్లో పంట నాశనం - కంబర్ వీజా ఆగ్ని పర్వతం నుంచి వస్తున్న లావా
స్పెయిన్ లా పల్మాలోని కంబర్ వీజా అగ్నిపర్వతం (Cumbre Vieja Volcano) విస్ఫోటం చెందిన దాదాపు ఆరు వారాల తర్వాత కూడా పెద్దఎత్తున లావా బయటకు వస్తుంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతం అంతా దట్టమైన పొగలతో నిండింది. సుమారు 7,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. 2,100 పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. అగ్నిపర్వతం నుంచి పొంగి వస్తున్న లావా.. సుమారు 2,200 ఎకరాల పంట భూమిని నాశనం చేసింది.