హైవేపై ట్రాఫిక్ జామ్‌కు కారణమైన విమానం - ప్రమాదం
క్రొయేషియాలో ఓ విమానం అత్యవసరంగా ల్యాండైంది. దేశ రాజధాని జాగ్రెబ్‌లో నిత్యం రద్దీగా ఉండే రహదారిపై దిగింది. విమానం దెబ్బతిన్నా, అదృష్టవశాత్తు అందులో ఉన్న ఇద్దరికి, రోడ్డుపై ప్రయాణించేవారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. రోడ్డుపై విమానాన్ని చూసి వాహనదారులు ఆశ్చర్యపోయారు. ఇంజిన్‌లో సాంకేతిక లోపం వల్లే అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని అధికారులు చెప్పారు.
Last Updated : Sep 27, 2019, 9:26 AM IST