గ్రీస్‌లో తుపాను బీభత్సం- ఆరుగురు మృతి - తుపాను
గ్రీస్ దేశంలో తుపాను బీభత్సం సృష్టించింది. జనజీవనం స్తంభించింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 140 మందికిపైగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో ఇద్దరు రష్యా, ఇద్దరు రోమానియా, ఇద్దరు చెక్‌రిపబ్లిక్ దేశస్థులుగా అధికారులు గుర్తించారు. తుపాను ధాటికి భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. భారీగా ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయి. థెస్సలోనికి నగరం సహా పలు ప్రాంతాల్లో ఎమర్జెన్సీ విధించారు.