చైనాకు వ్యతిరేకంగా పీఓకేలో భారీ కాగడాల ర్యాలీ - Muzaffarabad
నీలం-జీలం నదిపై చైనా భారీ డ్యామ్లు నిర్మించటాన్ని వ్యతిరేకిస్తూ.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో పెద్ద ఎత్తున నిరనసలు చేపట్టారు అక్కడి యువకులు. ముజఫరబాద్ నగరంలో చైనాకు వ్యతిరేకంగా కాగడాల ర్యాలీ నిర్వహించారు. చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.