నైజీరియా: ప్రసిద్ధ బోలోగన్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం - బోలోగన్ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం
నైజీరియాలోని లాగోస్ నగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రసిద్ధ బోలోగన్ మార్కెట్లోని ఓ భవనం పైభాగంలో భారీగా మంటలు చెలరేగాయి. తక్షణం స్పందించిన స్థానికులు.. భవంతిలోని సరుకులను పై నుంచి కిందకి విసిరేశారు. మార్కెట్ రద్దీ కారణంగా అగ్నిమాపక దళాలు మంటలను అదుపుచేయడంలో ఇబ్బంది కలుగుతోంది.