'అగ్నికి ఆహుతైన విలాసవంతమైన విహార నౌక' - మంటల్లో చిక్కుకున్న అమెరికన్ వాహననౌక
అమెరికాలో ఓ విలాసవంతమైన విహారనౌకలో తీవ్రమైవ మంటలు చెలరేగాయి. దీన్ని అదుపుచేసేందుకు 45 మంది అగ్నిమాపక సిబ్బంది 2 గంటలపాటు శ్రమించారు. అనంతరం ఆ నౌక అట్లాంటిక్ తీరంలోని బిస్కేయిన్ అఖాతంలో పాక్షికంగా మునిగిపోయింది. సుమారు 120 అడుగుల పొడవుగల నౌకలో.. స్థానిక ఐలాండ్ గార్డెన్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇది ప్రముఖ అమెరికన్ గాయకుడు మార్క్ ఆంథోనీకి చెందినదిగా అధికారులు పేర్కొన్నారు. అయితే.. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు.