ఫుడ్ సెంటర్లో మంటలు.. తప్పిన ప్రాణనష్టం - అమెరికా వార్తలు తెలుగులో
అమెరికా డెట్రాయిట్లోని ఓ ఫుడ్ సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు భారీగా చెలరేగాయి. దట్టమైన పొగ కమ్ముకుంది. 40 అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది తీవ్రంగా శ్రమించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. యాజమాన్యం, వినియోగదారులు అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఘటనలో భవనం భారీగా దెబ్బతింది. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు చేపట్టారు.